Indian Oil One: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. చాట్‌జీపీటీని అధిగమించిన 'ఇండియన్ ఆయిల్ వన్'
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ యాప్ ఇండియన్ ఆయిల్ వన్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్‌లలో అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ జాబితాలో కొంతకాలకంగా ఓపెన్ఏఐకి చెందిన చాట్‌బాట్ చాట్‌జీపీటీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ధరలు పెరుగుతాయని, దొరకకపోవచ్చనే ఆందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. గృహ వినియోగదారులకు ఎలాంటి వంట గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తోంది. అయినప్పటికీ పెద్ద ఎత్తున వంట గ్యాస్ బుక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డౌన్‌లోడ్‌లలో చాట్‌జీపీటీని ఇండియన్ ఆయిల్ వన్ వెనక్కి నెట్టిందని యాప్ ఎనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ సెన్సార్ టవర్ వెల్లడించింది.
సిలిండర్ల బుకింగ్, డెలివరీ ట్రాకింగ్, కొత్త కనెక్షన్ తదితర సేవల కోసం ఇండియన్ ఆయిల్ వన్ యాప్‌ను తీసుకువచ్చారు. దేశంలో ప్రస్తుతం ఎల్పీజీ కొరత ఆందోళనల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ వన్ యాప్‌ను పెద్ద ఎత్తున డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. గడిచిన నెల రోజుల్లో 40 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నట్లు సెన్సార్ టవర్ తెలిపింది.