Chandrababu Naidu: విజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి, వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత 21 నెలల్లో ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ విందులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమ, షేక్ నజీర్ అహ్మద్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.