Masoud Pezeshkian: ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్... అధ్యక్షుడు వాడే విమానం పేల్చివేత

Israel Strikes Iran Destroys Presidents Plane
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో ఇరాన్ అగ్ర నాయకత్వం ఉపయోగించే ఒక కీలక విమానాన్ని ధ్వంసం, పలు సైనిక స్థావరాలను చేసినట్లు సోమవారం ప్రకటించింది. ఈ దాడితో ఇరాన్, దాని మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతింటుందని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) పేర్కొంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు తెలిపింది.

ఐడీఎఫ్ ప్రకటన ప్రకారం, ధ్వంసమైన విమానం ఎయిర్‌బస్ ఏ340. దీనిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, గతంలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వంటి అగ్ర నాయకులు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉపయోగించేవారు. టెహ్రాన్‌లోని ఈ విమానాశ్రయంలో దేశీయ విమానాలతో పాటు ఇరాన్ వైమానిక దళానికి చెందిన సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్ వంటి ఇతర నగరాల్లోని మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

మరోవైపు, హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచే విషయంలో అమెరికాకు మిత్రదేశాలు సాయం చేయకపోతే నాటో భవిష్యత్తు 'చాలా దారుణంగా' ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, ఆదివారం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి ద్వారా యూరప్ దేశాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని, కాబట్టి అక్కడి భద్రతకు వాళ్లు కూడా బాధ్యత వహించాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా గతంలో యూరప్‌కు సాయం చేసిందని, ఇప్పుడు వారు తమకు సాయం చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన వాదించారు.


Go Back to Shorts
Masoud Pezeshkian
Iran
Israel
A340 Airbus
Tehran
IDF
Hormuz Strait
Donald Trump
Military attack
Middle East conflict

More Telugu News