KCR: మీ సలహాలు స్వీకరిస్తాం.. సభకు రండి: కేసీఆర్‌కు కోమటిరెడ్డి విజ్ఞప్తి
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి, సభా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కనీస బాధ్యత అని ఆయన అన్నారు. నిన్న సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలు మార్పు కోరుకునే కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని, ఆ తీర్పును స్వాగతించాలని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వ పనితీరుపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. "మా పనిలో ఏవైనా తప్పులుంటే చెప్పండి, తప్పకుండా మార్చుకుంటాం. కానీ, అసెంబ్లీకే రాకపోవడం సరికాదు," అని హితవు పలికారు.
ఇటీవల కేసీఆర్ సభకు ఒక్క నిమిషం మాత్రమే హాజరై, గవర్నర్ ప్రసంగం ముగియకముందే వెళ్లిపోవడం, మరణించిన సభ్యులకు సంతాపం తెలిపేంత వరకు కూడా ఉండకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీపై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. ప్లోరైడ్ తో నల్లొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తే వారి జీవితాలు కూడా బాగుపడతాయని మంత్రి పేర్కొన్నారు.