Ustaad Bhagat Singh: "ఇచ్చిపడేసే గోత్రం...ఇరగదీసే నక్షత్రం"... వచ్చేసింది 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్!

Ustaad Bhagat Singh Trailer Released Starring Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది. శనివారం సాయంత్రం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ట్రైలర్‌ను విడుదల చేసింది. "ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం" అంటూ పవన్ మార్కు డైలాగులతో ఉన్న ట్రైలర్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉగాది పండుగ కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. వాస్తవానికి మార్చి 26న విడుదల కావాల్సి ఉన్నా, మరో సినిమా వాయిదా పడటంతో 'ఉస్తాద్' ముందుగానే థియేటర్లలోకి వస్తోంది.

ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. తొలి 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 అదనంగా వసూలు చేసుకోవచ్చు. అలాగే, మార్చి 19న తెల్లవారుజామున 4 లేదా 5 గంటల నుంచి బెనిఫిట్ షోలు ప్రదర్శించుకోవడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాటలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, నేపథ్య సంగీతాన్ని (బీజీఎం) తమన్ సమకూర్చడం విశేషం. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది.
Go Back to Shorts
Ustaad Bhagat Singh
Pawan Kalyan
Harish Shankar
Mythri Movie Makers
Sree Leela
Raashi Khanna
Devi Sri Prasad
Thaman

More Telugu News