PhonePe: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫోన్‌పే 'ఆల్-ఇన్-వన్' కార్డు వచ్చేసింది!

PhonePe All in One Card Launched for Hyderabad Metro Passengers
  • కొత్త ఎన్‌సీఎంసీ కార్డు ఆవిష్కరించిన ఫోన్ పే
  • నెట్ లేకున్నా ఆఫ్‌లైన్‌లో ట్యాప్-అండ్-పే సదుపాయం
  • హైదరాబాద్ మెట్రో కౌంటర్లలో కార్డులు అందుబాటులో
  • దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, టోల్‌ప్లాజాల్లో చెల్లింపులు
  • గరిష్ఠంగా రూ.2,000 వరకు బ్యాలెన్స్‌
  • అన్ని ప్రయాణాలకు ఇక ఒకటే కార్డు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే సరికొత్త 'రూపే ఆన్-ది-గో' కార్డును అందుబాటులోకి తెచ్చింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (NCMC) కింద పనిచేసే ఈ కార్డుతో రవాణా చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆఫ్‌లైన్‌లోనే దీని ద్వారా పేమెంట్స్ చేయవచ్చు.

ఎలా పొందాలి?
  • ప్రయాణికులు తొలి దశలో హైదరాబాద్‌లోని మెట్రో టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు
  • మీ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ధ్రువీకరించాలి
  • మెట్రో ఏజెంట్ ద్వారా కార్డు తీసుకుని యూపీఐ, నగదు లేదా ఇతర కార్డుల ద్వారా డబ్బులు జమ చేసుకోవచ్చు

ప్రత్యేకతలు ఇవే..
ప్రీపెయిడ్ విధానం: ఈ కార్డులోని చిప్‌లోనే డబ్బు నిల్వ ఉంటుంది. కాబట్టి ఇంటర్నెట్ అవసరం లేకుండానే 'ట్యాప్-అండ్-పే' పద్ధతిలో టికెట్ ఛార్జీలు చెల్లించవచ్చు.
లావాదేవీల పరిమితి: కార్డులో గరిష్ఠంగా రూ.2,000 వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఆఫ్‌లైన్ ద్వారా ఒకేసారి గరిష్ఠంగా రూ.500 వరకు లావాదేవీలు జరపవచ్చు.

ఒక్క కార్డు.. ఎన్నో ఉపయోగాలు: ఇది కేవలం హైదరాబాద్ మెట్రోకే పరిమితం కాదు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లోని మెట్రోలు, బస్సులు, రైళ్లు, టోల్ ప్లాజాలు, పార్కింగ్ కేంద్రాల్లో కూడా ఈ కార్డును వాడుకోవచ్చు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని రవాణా సంస్థలతో అనుసంధానం చేసి, ఈ సేవలను మరింత విస్తరిస్తామని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ వెల్లడించారు.
PhonePe
Hyderabad Metro
NCMC card
National Common Mobility Card
Metro Card
Deep Agrawal
offline payments
prepaid card
UPI
transportation

More Telugu News