Pete Hegseth: ఈరోజు అత్యంత తీవ్ర దాడులు చేస్తాం.. ఇరాన్‌ను పూర్తిగా ఓడించే వరకు విశ్రమించేది లేదు: అమెరికా

Pete Hegseth US to Launch Intense Strikes on Iran Today
  • పెంటగాన్‌లో మీడియాతో మాట్లాడిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్
  • గత 24 గంటల్లో ఇరాన్ అతి తక్కువ మిసైల్స్‌ను ప్రయోగించిందని వెల్లడి
  • గల్ఫ్ దేశాలపై దాడులను ఖండించిన వైనం
ఇరాన్‌పై ఈరోజు గత పదిరోజులకు మించి దాడులు చేస్తామని, ఈ దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. ఆయన పెంటగాన్‌లో మీడియాతో మాట్లాడుతూ, శత్రువును పూర్తిగా దెబ్బతీసే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు చేయని తీవ్ర దాడి ఈరోజు ఉంటుందని అన్నారు. గత 24 గంటల్లో ఇరాన్ అతి తక్కువ మిసైల్స్‌ను ప్రయోగించిందని అన్నారు.

ఇరాన్ ఇప్పుడు ఒంటరి అయిందని వ్యాఖ్యానించారు. ఈ ఆపరేషన్ 10వ రోజు దాటిందని, ఇరాన్ దారుణంగా ఓడిపోనుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేయడాన్ని హెగ్సెత్ తీవ్రంగా ఖండించారు. గల్ఫ్ దేశాల్లో కొన్నింటితో ఇరాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని, అయినప్పటికీ ఇరాన్ దాడి చేసిందని అన్నారు. మూడు లక్ష్యాలను సాధించడానికి ఈరోజు అత్యధిక ఫైటర్లు, అత్యధిక బాంబర్లతో దాడులు చేయనున్నామని అన్నారు.

ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను, వారి నావికాదళాలను నాశనం చేయడం, అణ్వాయుధాలను శాశ్వతంగా తొలగించడమే తమ లక్ష్యాలని అన్నారు. సైనిక శక్తి, సాంకేతిక నైపుణ్యంతో తాము శత్రువును ఓడిస్తున్నామని ఆయన అన్నారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
Pete Hegseth
Iran
United States
US Military
Military Strikes
Gulf Countries
Nuclear Weapons

More Telugu News