Gas Cylinder Price: గ్యాస్ మంట.. కరెంటు బాట: ఇండక్షన్ కుక్కర్లకు పెరిగిన గిరాకీ

Gas Cylinder Price Hike Drives Demand for Induction Cookers in Kolkata
  • ఎల్‌పీజీ ధరల పెరుగుదల ప్రభావంతో సామాన్యుల విలవిల
  • కోల్‌కతాలో అమాంతం పెరిగిన ఎలక్ట్రిక్ వస్తువుల అమ్మకాలు
  • గ్యాస్ కంటే ఇండక్షనే చౌకని భావిస్తున్న గృహిణులు
  • మార్కెట్‌లో ఎయిర్ ఫ్రయర్లు, ఓవెన్లకు ఫుల్ డిమాండ్
  • ప్రత్యామ్నాయ ఇంధనం వైపు మొగ్గు చూపుతున్న జనం
గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎల్‌పీజీ ధరల భారం మోయలేక కోల్‌కతా ప్రజలు ఇప్పుడు వంట గదిలో భారీ మార్పులు చేసుకుంటున్నారు. గ్యాస్ పొయ్యిని పక్కన పెట్టి కరెంటు పొయ్యి (ఇండక్షన్ కుక్కర్) వైపు మళ్లుతున్నారు. దీంతో నగరంలోని ఎలక్ట్రానిక్ మార్కెట్లలో ఇండక్షన్ కుక్కర్లు, ఓవెన్లు, ఎయిర్ ఫ్రయర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

గ్యాస్ సిలిండర్ ధర వేయి రూపాయలు దాటడంతో నెలకు అయ్యే ఖర్చును తగ్గించుకునేందుకు వినియోగదారులు ఇండక్షన్ కుక్కర్లను ఆశ్రయిస్తున్నారు. గ్యాస్‌తో పోలిస్తే ఇండక్షన్ వంట ఖర్చు దాదాపు 30 నుంచి 40 శాతం తక్కువగా ఉంటోందని గృహిణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

నగరంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ విక్రయ కేంద్రాల ప్రతినిధులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా వంట గదికి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువుల సేల్స్ గణనీయంగా పెరిగాయని తెలిపారు. కేవలం ఇండక్షన్ కుక్కర్లే కాకుండా, సమయాన్ని, ఖర్చును ఆదా చేసే ఎయిర్ ఫ్రయర్ల కొనుగోళ్లకు కూడా జనం ఆసక్తి చూపిస్తున్నారు. 
Gas Cylinder Price
LPG Price Hike
Induction Cooker
Electric Cooker
Kolkata
Air Fryer
Oven
Cooking Gas
Cost Effective Cooking
Middle Class Families

More Telugu News