Telangana Weather: తెలంగాణలో భానుడి భగభగ... ములుగులో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Scorching heat in Telangana Mulugu records 39 degrees
  • పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలు
  • ఆదిలాబాద్, ఖమ్మం, జగిత్యాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు
  • వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచన
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. గురువారం ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఖమ్మం, జగిత్యాలలో 38.9 డిగ్రీలు, మంచిర్యాలలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ములుగు, ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీమ్, నాగర్ కర్నూలు, నిజామాబాద్ తదితర జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Telangana Weather
Telangana heatwave
Heatwave
Mulugu
Adilabad
Hyderabad weather
Telangana temperature

More Telugu News