అర్జున్ టెండూల్కర్ జీవితకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను: నారా లోకేశ్

Nara Lokesh Wishes Arjun Tendulkar a Happy Married Life
  • ముంబైలో అర్జున్ టెండూల్కర్ వివాహ రిసెప్షన్
  • భార్య బ్రహ్మణితో కలిసి హాజరైన మంత్రి నారా లోకేశ్
  • నూతన వధూవరులు అర్జున్, సానియాలను ఆశీర్వదించిన లోకేశ్
  • వేడుకపై సోషల్ మీడియాలో స్పందించిన ఏపీ మంత్రి
  • ముఖేశ్ అంబానీ, జై షాలను కలిసినట్లు వెల్లడి
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, తన అర్ధాంగి నారా బ్రహ్మణితో కలిసి ముంబైలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వేడుకకు హాజరవడంపై లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. "లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ రిసెప్షన్ కోసం ముంబైలో ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకల్లో బ్రహ్మణితో కలిసి పాల్గొని, ముఖేశ్ అంబానీ గారు, ఐసీసీ ఛైర్మన్ జై షా, ఇతర మిత్రులను కలవడం సంతోషాన్నిచ్చింది" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అర్జున్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. "అర్జున్‌కు జీవితాంతం సంతోషం, విజయం చేకూరాలని, క్రికెట్‌లో మరెన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను," అంటూ ఆయన ఆకాంక్షించారు. లోకేశ్ దంపతులు వధూవరులతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Go Back to Shorts
Arjun Tendulkar
Sachin Tendulkar
Nara Lokesh
Nara Brahmani
Sania Chandhok
Mumbai Reception
Mukesh Ambani
Jay Shah
Cricket
Wedding Reception

More Telugu News