గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Government Good News for Village Ward Secretariat Employees
  • ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇస్తామని మంత్రి డోలా హామీ
  • అసెంబ్లీలో ప్రకటన
  • పర్యవేక్షణ కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని ప్రకటించింది. అదే సమయంలో, గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను 'స్వర్ణ గ్రామం', 'స్వర్ణ వార్డు' కార్యాలయాలుగా మారుస్తూ శాసన మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం లభించింది. 

బుధవారం శాసన మండలిలో ఈ బిల్లు ఆమోదం సందర్భంగా రాష్ట్ర స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడారు. ఈ కొత్త కార్యాలయాల ద్వారా 'స్వర్ణాంధ్ర' సాధనకు కృషి చేస్తామని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యాలయాల పర్యవేక్షణ కోసం మూడంచెల వ్యవస్థను తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండేదని, కూటమి ప్రభుత్వంలో దానిని పటిష్ఠం చేస్తున్నామని మంత్రి వివరించారు. కూటమి పాలనలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని డోలా అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. తాము ఆ నిధులను విడుదల చేశామని తెలిపారు.
 
Go Back to Shorts
Dola Sri Balaveeranjaneya Swamy
AP Government
Grama Sachivalayam
Wards Sachivalayam
Swarna Gramam
Swarna Ward
Andhra Pradesh
AP Sachivalayam Employees
AP Promotions
Panchayat Funds

More Telugu News