Deepika Battula: డాక్టర్ దీపిక మృతిపై జ్యుడిషియల్ విచారణ జరపాలి: సీఎం, మంత్రులను కోరిన తండ్రి

Deepika Battula Death Father requests judicial inquiry from CM
  • సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రులను కలిసిన కుటుంబ సభ్యులు
  •  తోటి విద్యార్థులపై అనుమానాలున్నాయని ఆరోపణ
  • పోస్టుమార్టం నివేదిక ఆలస్యంపై తండ్రి అసంతృప్తి 
  • రూ.50 లక్షల పరిహారంతో ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎనస్థీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక అనుమానాస్పద మృతి కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని ఆమె తండ్రి కోదండరామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనితలను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. 

ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘రాత్రి విధులకు వెళ్లిన నా కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో తోటి విద్యార్థులు, మరికొందరిపై మాకు అనుమానాలున్నాయి. ఫిబ్రవరి 5న పోస్టుమార్టం నిర్వహించినా ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీపిక మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

తమ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.50 లక్షల పరిహారం అందించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వినతిని సావధానంగా విన్న ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Deepika Battula
Vijayawada Government Hospital
Anesthesia PG student
Suspicious death
Judicial inquiry
Chandrababu Naidu
Nara Lokesh
Vangalapudi Anita
Postmortem report

More Telugu News