BSNL: 72 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... మిగతా బెనిఫిట్స్ ఇవిగో!

BSNL Launches New Plan With 72 Days Validity
  • బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్
  • 72 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా
  • అన్ని నెట్‌వర్క్‌‌లకు అపరిమిత వాయిస్ కాల్స్
ప్రైవేట్ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సిద్దమైంది. ఈ క్రమంలో తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. రూ. 500 లోపు ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని రూ.485 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. 

ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులకు 72 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా పొందవచ్చు. డేటా విషయానికొస్తే, ఈ ప్లాన్ కింద రోజుకు 2.5జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది.
BSNL
BSNL prepaid plan
BSNL 485 plan
Bharat Sanchar Nigam Limited
Reliance Jio
Airtel
Vodafone Idea
prepaid plans
telecom offers

More Telugu News