Manchu Vishnu: అప్పుడప్పుడు ఆ శబ్దాలు తప్ప.. దుబాయ్‌లో క్షేమంగానే ఉన్నాం: మంచు విష్ణు పోస్టు

Manchu Vishnu Safe in Dubai Amidst Middle East Tensions
  • ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం... దుబాయ్‌లో విష్ణు కుటుంబం
  • అప్పుడప్పుడు దూరం నుంచి శబ్దాలు తప్ప ఆందోళన లేదన్న మంచు విష్ణు
  • యూఏఈ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన మంచు విష్ణు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో, దుబాయ్ లో ఉంటున్న ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు కుటుంబం పరిస్థితిపై ఆందోళన నెలకొంది. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విష్ణు కుటుంబం, బంధువులు, స్నేహితులు, అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, తన సోదరుడు క్షేమంగా ఉండాలంటూ మంచు లక్ష్మీ 'ఎక్స్' వేదికగా పోస్టు పెట్టారు.

తన భద్రత గురించి అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంచు విష్ణు 'ఎక్స్' వేదికగా తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. "మేం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దుబాయ్‌లో మా కుటుంబం సురక్షితంగానే ఉంది. అప్పుడప్పుడు దూరం నుంచి వచ్చే శబ్దాలు తప్ప, ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదు. మేం ప్రశాంతంగా ఉన్నాం" అని విష్ణు పేర్కొన్నారు.

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ ఇక్కడి ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలు అద్భుతమని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పటిష్టమైన నాయకత్వాన్ని కనబరుస్తున్నారంటూ యూఏఈ అధికారులకు మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్లను దుబాయ్‌లో ఇంటర్‌సెప్టర్లు అడ్డుకుంటున్న వీడియోను మంచి విష్ణు అంతకుముందు ట్వీట్ చేశారు.
Manchu Vishnu
Dubai
Iran
Israel
Middle East conflict
Manchu Lakshmi
UAE
Dubai safe
West Asia tensions

More Telugu News