తెలంగాణలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి: కుమ్మెర జాతర ఘటనపై కేటీఆర్ ఆగ్రహం
- చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్
- సమాజం తలదించుకోవాల్సిన ఘటన జరిగిందన్న కేటీఆర్
- నిందితులను కాపాడే ప్రయత్నం సిగ్గుమాలిన చర్య అన్న కేటీఆర్
రెండేళ్ల చిన్నారికి కులం తెలుసా, మతం తెలుసా, పసిగుడ్డు ఏం అడిగిందని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు కారణమైన 8 మందిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి ప్రాణాలు తీసిన వారికి ఎవరూ అండగా నిలవవద్దని అన్నారు.
నిందితులను కాపాడేయత్నం సిగ్గుమాలిన చర్య అన్నారు. వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని కేటీఆర్ అన్నారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.