Vikram Prabhu: ఓటీటీలో చూడాల్సిన పోలీస్ స్టోరీ ఇది!
- 2022లో విడుదలైన సినిమా
- సహజత్వానికి దగ్గరగా నిలిచే కథ
- వాస్తవాలను కళ్లముందు నిలిపే కంటెంట్
- ఆకట్టుకునే ఎమోషన్స్
విక్రమ్ ప్రభు పోలీస్ కానిస్టేబుల్ గా నటించిన 'సిరై' ఇటీవల ఓటీటీకి వచ్చింది. కథాకథనాల పరంగా ఈ సినిమా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పోలీస్ గా తన పాత్రలో విక్రమ్ ప్రభు ఆకట్టుకున్నాడు. దాంతో గతంలో ఆయన పోలీస్ గా చేసిన 'తానక్కరన్' సినిమాపైకి చాలామంది దృష్టి వెళ్లింది. తమిళ్ దర్శకత్వ వహించిన ఈ సినిమా, 2022లో థియేటర్లకు వచ్చింది. 'రక్షకభటుడు' పేరుతో తెలుగులోనూ విడుదలైంది. ప్రస్తుతం 'హాట్ స్టార్'లో అందుబాటులో ఉంది.
సాధారణంగా పోలీస్ కథలు అనగానే .. స్థానిక రాజకీయాలు .. రౌడీ పోరాటాలు .. పోలీస్ పెద్దల టార్చర్ .. మొదలైన అంశాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అయితే అందుకు భిన్నంగా ఈ కథ నడుస్తుంది. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆనంద్ కూడా పోలీస్ శిక్షణ కోసం వస్తాడు. అక్కడ అతనికి ముత్తుపాండి .. ఈశ్వరమూర్తి తారసపడతారు. ట్రైనింగ్ కోసం వచ్చినవారిపై వాళ్లు తమ శాడిజం చూపించడం మొదలుపెడతారు.
ఆ ఇద్దరి అరాచకాన్ని ఆనంద్ చూడలేకపోతాడు. వాళ్లకి ఎదురు మాట్లాడితే ఏం జరుగుతుందో తెలిసి కూడా ప్రశ్నిస్తాడు. ఫలితంగా అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కథ. వాస్తవానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు .. ఎమోషన్స్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా చెప్పుకోవాలి. అధికారుల ఇగో నేది కొన్ని జీవితాలను .. కొన్ని ఆశయాలను ఎలా దెబ్బతీస్తాయనేది చూపించిన విధానమే ఈ సినిమాను ప్రతి ఒక్కరికీ కనెక్ట్ చేస్తుంది.