Harry Brook: బ్రూక్ అద్భుత సెంచరీ... పాక్‌పై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ

Harry Brook Century Leads England to Thrilling Victory Over Pakistan
  • సూపర్ 8 పోరులో పాకిస్థాన్‌పై 2 వికెట్ల తేడాతో గెలుపు
  • చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్
  • 165 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించిన ఇంగ్లండ్
  • 50 బంతుల్లో 100 పరుగులు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్
  • 4 వికెట్లతో రాణించిన పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (100) అసాధారణ సెంచరీతో చెలరేగడంతో, పాకిస్థాన్‌పై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (0), జోస్ బట్లర్ (2) ఘోరంగా విఫలమయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒంటిచేత్తో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు.

అయితే బ్రూక్ సెంచరీ తర్వాత ఔటవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. ఆ వెంటనే నవాజ్ బౌలింగ్ లో విల్ జాక్స్ (28), జేమీ ఓవర్టన్ (0) కూడా ఒకే ఓవర్లో వెనుదిరగడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఒకానొక దశలో పాకిస్థాన్ గెలుస్తుందనిపించింది. కానీ చివర్లో జోఫ్రా ఆర్చర్ (5) కీలక బౌండరీ బాదడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 4 వికెట్లతో సత్తా చాటాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆ జట్టులో సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్ధ సెంచరీతో రాణించాడు. బాబర్ ఆజం (25), ఫఖర్ జమాన్ (25) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ చెరో రెండు వికెట్లు తీశారు.
Harry Brook
Harry Brook century
England vs Pakistan
T20 World Cup
Sahibzada Farhan
Shaheen Afridi
England win
Pakistan cricket
Pallekele
Liam Dawson

More Telugu News