యూనివర్సిటీలో చికెన్ కోసం గొడవ.. కర్రలతో కొట్టుకున్న విద్యార్థులు
- చికెన్ పంపకాలకు సంబంధించి రెండు గ్రూపుల మధ్య ఘర్షణ
- పరస్పరం కర్రలతో దాడి చేసుకున్న విద్యార్థులు
- కేయూలోని ఎంబీఏ, ఎకనమిక్స్ ఫస్టియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ
ఎంబీఏ ఫస్టియర్, ఎకనమిక్స్ ఫస్టియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాటా మాటా పెరిగి కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. కొందరు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. పలువురికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది.