Gachibowli: గచ్చిబౌలిలో రూ.1.76 లక్షలు పలికిన చదరపు గజం భూమి
- నగరంలోని పలు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు భూముల వేలం
- కేపీహెచ్‌బీ కమ్యూనిటీ హాలులో 14 స్థలాల వేలం
- బాలాజీనగర్‌లో చదరపు గజం రూ.1.64 లక్షలు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చదరపు గజం భూమి రూ.1.76 లక్షలు పలికింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములను వేలం వేయగా అధిక ధరలు పలికాయి. కేపీహెచ్‌బీ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన ఈ వేలంలో 50 మంది బిల్డర్లు పాల్గొన్నారు.
గచ్చిబౌలి, బౌరంపేట, కూకట్ పల్లి బాలాజీనగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 స్థలాలను బహిరంగ వేలం వేశారు. ఇందులో గచ్చిబౌలి భూమి చదరపు గజం రూ.1.76 లక్షలు, కూకట్ పల్లి బాలాజీనగర్‌లో చదరపు గజం రూ.1.64 లక్షలు పలికింది. బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.34.27 కోట్ల ఆదాయం సమకూరింది.