Nara Bhuvaneswari: చూసిందే నమ్మండి: హెరిటేజ్ పై నారా భువనేశ్వరి ప్రత్యేక వీడియో

Nara Bhuvaneswari Releases Heritage Promise Video
షార్ట్స్‌లో చూడండి
హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తమ సంస్థ నాణ్యతా ప్రమాణాలపై వినియోగదారులకు భరోసా ఇస్తూ 'హెరిటేజ్ ప్రామిస్' పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. 'చూసిందే నమ్మండి' అనే నినాదంతో విడుదలైన ఈ వీడియోలో కంపెనీ పనితీరు, రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను ఆమె వివరించారు.

గత 33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా హెరిటేజ్ పనిచేస్తోందని భువనేశ్వరి తెలిపారు. రూ.4 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ, నేడు రూ.4,000 కోట్ల స్థాయికి ఎదిగినా నాణ్యత విషయంలో ఎన్నడూ రాజీ పడలేదని ఆమె స్పష్టం చేశారు. వినియోగదారుల ఇంటికి చేరే ప్రతి ఉత్పత్తి 25 కఠినమైన నాణ్యతా పరీక్షలు దాటిన తర్వాతే వస్తుందని, 500 మందికి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తారని ఆమె పేర్కొన్నారు.

తొమ్మిది రాష్ట్రాల్లోని సుమారు 3 లక్షల మంది పాడి రైతులతో తమ సంస్థ కలిసి పనిచేస్తోందని భువనేశ్వరి వివరించారు. పారదర్శకత, న్యాయమైన ధర, సకాలంలో చెల్లింపులు అనే సూత్రాలతో రైతులకు సాధికారత కల్పిస్తున్నామని అన్నారు. ఈ వీడియోను పూర్తిగా చూసి, వాస్తవాలను స్వయంగా తెలుసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
Heritage Foods
Heritage Promise
Dairy Products
Quality Standards
Milk Products
Farmers Empowerment
Telugu News
Andhra Pradesh
Nara Chandrababu Naidu

More Telugu News