Machilipatnam: ప్రియురాలితో ప్రయాణం చేయించలేదని ...!

Machilipatnam Youth attacks bus staff for not allowing girlfriend to travel with him
షార్ట్స్‌లో చూడండి
ప్రియురాలి కోసం ఓ యువకుడు ప్రైవేట్ ట్రావెల్ బస్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి ప్రయాణించేందుకు ఇద్దరు ప్రేమికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సీట్లు బుక్ చేసుకున్నారు. అయితే బుకింగ్ సమయంలో యువతుల పేర్లతో రెండు సీట్లు నమోదు చేశారు. ఆ సీట్లలో సదరు యువకుడిని కూర్చోనివ్వడానికి బస్ డ్రైవర్ నిరాకరించాడు. దీంతో బస్ సిబ్బందితో యువకుడు వాగ్వాదానికి దిగాడు. 

ఈ క్రమంలో మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లో ప్రేమికులు బస్సు దిగారు. ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోనివ్వని డ్రైవర్‌ను వదలొద్దని యువతి చెప్పడంతో యువకుడు మరింత రెచ్చిపోయాడు. అనంతరం చిలకలపూడి సెంటర్‌లో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. 

దాడిలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
Go Back to Shorts
Machilipatnam
Krishna district
Private travels bus
Bus driver attack
Girlfriend travel
Chilakalapudi
Hyderabad
Bus stand fight
Andhra Pradesh crime

More Telugu News