టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో భారీ చోరీ
- చింతలపూడిలోని నివాసంతో తెల్లవారుజామున చోరీ
- 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, రూ. 1 లక్ష నగదు అపహరణ
- చింతలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
ఉదయాన్నే పనులకు వచ్చిన పనిమనుషులు ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. ఇదేదో దొంగల పనే అయి ఉంటుందని అనుమానించారు. వెంటనే ప్రమీలాదేవికి విషయం తెలియజేయగా ఆమె ఇంట్లో నగలు, డబ్బు ఉంచిన ప్రదేశాన్ని తనిఖీ చేశారు. అక్కడ ఏమీ లేకపోవడంతో వెంటనే చింతలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, రూ.1 లక్ష నగదు చోరీకి గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి పనిమనుషులను, చుట్టుపక్కల వారిని, అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ చోరీ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది.