Rohit Sharma: వసీం అక్రమ్ ను హత్తుకున్న రోహిత్ శర్మ

Rohit Sharma hugs Wasim Akram before India Pakistan match
  • నిన్న భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం
  • ప్రీ మ్యాచ్ షో సందర్భంగా అక్రమ్ ను హత్తుకున్న రోహిత్
  • వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు

కొలంబోలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రీమ్యాచ్ షోలో యాంకర్ సంజనా గణేశన్ సమక్షంలో జరిగిన ఓ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. 


టీ20 వరల్డ్ కప్ కు అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ కు ముందే రోహిత్ కొలంబోకు వచ్చాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐసీసీ ప్రీ-మ్యాచ్ షోలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్‌ను రోహిత్ హత్తుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు, క్రికెట్ మైదానంలో ఘర్షణలు ఉన్నప్పటికీ... రోహిత్-వసీమ్ ఆత్మీయంగా వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. “క్రికెట్ స్నేహం రాజకీయాలకు అతీతం” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Rohit Sharma
Wasim Akram
India vs Pakistan
Colombo
T20 World Cup
Cricket
Sanjana Ganesan
ICC
Cricket friendship

More Telugu News