Ishan Kishan: అభిషేక్ శర్మ డకౌట్.. కౌంటర్ అటాక్ తో ఊపుతెచ్చిన ఇషాన్ కిషన్

Ishan Kishan Shines with Half Century in India vs Pakistan Match
  • టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య కీలక పోరు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
  • మెరుపు అర్ధశతకంతో చెలరేగిన ఇషాన్ కిషన్
  • ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా దూకుడుగా ఆడుతున్న భారత్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (54*) మెరుపు అర్ధశతకంతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా బౌలింగ్ ఎంచుకున్నాడు.

బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ చివరి బంతికే ఓపెనర్ అభిషేక్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా శిబిరంలో నిశ్శబ్దం నెలకొంది. అయితే, ఇషాన్ కిషన్ దాటిగా ఆడుతూ ఉత్సాహం కలిగించాడు. వన్ డౌన్ గా క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన కిషన్, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 50 పరుగులు చేసి అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు.

పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. తాజా సమాచారం అందేసరికి, భారత్ 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్ (72* ;9 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (10*) ఉన్నారు.
Ishan Kishan
Ishan Kishan batting
India vs Pakistan
T20 World Cup 2026
Abhishek Sharma
Tilak Varma
cricket match
Salman Agha
India cricket
Pakistan cricket

More Telugu News