Luna 9: చంద్రుడిపై గల్లంతైన నాటి స్పేస్ క్రాఫ్ట్ మిస్టరీని తేల్చేసిన కృత్రిమ మేధ!

Artificial Intelligence Solves Mystery of Missing Luna 9 Spacecraft on Moon
  • 1966 లో చంద్రుడిపై దిగిన సోవియట్ యూనియన్ స్పేస్ క్రాఫ్ట్ ‘లూనా 9’ 
  • ల్యాండైన మూడు రోజుల తర్వాత ‘మిస్సింగ్’
  • దశాబ్దాలుగా ఆ చోటును గుర్తించేందుకు శాస్త్రవేత్తల ప్రయత్నం
  • ఏఐ సాయంతో కచ్చితమైన లొకేషన్లను గుర్తించినట్లు వెల్లడి
చంద్రుడిపై విజయవంతంగా దిగిన తొలి మానవరహిత స్పేస్ క్రాఫ్ట్ ‘లూనా 9’ ఆచూకీని ఎట్టకేలకు గుర్తించామని అంతరిక్ష పరిశోధకులు తాజాగా వెల్లడించారు. 1966 ఫిబ్రవరి 3న అప్పటి సోవియట్ యూనియన్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి పంపించింది. చంద్రుడిపై విజయవంతంగా దిగిన ఈ వ్యోమనౌక.. చంద్రుడి ఉపరితలానికి సంబంధించి కీలకమైన వివరాలను పంపించింది. అయితే, ఇది కేవలం మూడు రోజుల పాటే పనిచేసింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది.

ఈ స్పేస్ క్రాఫ్ట్ ‘ఓసియానస్ ప్రొసెల్లారమ్’ రీజియన్ లో ల్యాండైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, వ్యోమనౌక దిగిన కచ్చితమైన లొకేషన్ ను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 1966 నుంచి ఈ విషయంపై శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఈ చిక్కుముడిని విప్పేసిందని యూకే, జపాన్ పరిశోధకులు తెలిపారు. నాసా తీసిన చిత్రాలను పరిశీలించి.. లూనా 9 చంద్రుడిపై దిగి గల్లంతైన చోటును ఏఐ గుర్తించిందని వివరించారు.

ఓసియానస్ ప్రొసెల్లారమ్ రీజియన్ లో లూనా 9 దిగినట్లు భావిస్తున్న కొన్ని లొకేషన్లను ఎంపిక చేసిందని, ఈ ఫలితాలపై మరిన్ని పరిశోధనలు జరిపి కచ్చితమైన లొకేషన్ ను గుర్తిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారత్ కు చెందిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ ద్వారా ఈ లొకేషన్లను పరీక్షించి చూస్తామని వివరించారు.
Luna 9
Soviet Union
Oceanus Procellarum
Chandrayaan 2
Artificial Intelligence
Moon Landing
Spacecraft
Lunar Exploration
NASA

More Telugu News