Narayana School: మదీనాగూడ నారాయణ స్కూల్ లో అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!

Narayana School Fire Accident in Madinaguda Hyderabad
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ లోని మదీనాగూడలో ఉన్న నారాయణ స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం స్కూల్ బిల్డింగ్ లోని సెల్లార్ లో మంటలు ఎగిసిపడ్డాయి. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్కూల్ టీచర్లు, ఇతర సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను క్షేమంగా బయటకు తరలించారు.

అగ్నిమాపక శాఖకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. పోలీసులు వారికి సహకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు.
Go Back to Shorts
Narayana School
Narayana School Madinaguda
Hyderabad fire accident
Madinaguda fire
School fire
Fire accident
Fire safety
Hyderabad news

More Telugu News