Kiran bodybuilder: ప్రియురాలికి మరొకరితో నిశ్చితార్థం... ఆత్మహత్య చేసుకున్న బాడీబిల్డర్

Kiran Bodybuilder Commits Suicide After Girlfriends Engagement
షార్ట్స్‌లో చూడండి
ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువ బాడీబిల్డర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ప్రియురాలికి వేరొకరితో వివాహం నిశ్చయం కావడంతో అతను ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్‌కు చెందిన కిరణ్ (26) జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ, బాడీబిల్డర్‌గా రాణిస్తున్నాడు. గత మూడేళ్లుగా అతను ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే శనివారం సాయంత్రం ప్రియురాలిని కలిసినప్పుడు ఆమె తనకు షాకిచ్చింది. వేరొక వ్యక్తితో తన వివాహం నిశ్చయమైందని, ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందని చెప్పింది. అంతేకాదు, తన పెళ్లి కోసం కొనుగోలు చేసిన చీరను, ఆహ్వాన పత్రికను కూడా కిరణ్‌కు చూపించింది.

ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన కిరణ్, ఇంటికి తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కిరణ్ గదిలో ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ప్రియురాలు, ఆమె తల్లే కారణమని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

వాలెంటైన్స్ డే కోసం కిరణ్ ప్లాన్ చేసుకుంటున్న సమయంలో ఈ ఘోరం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Kiran bodybuilder
Kiran suicide
Bangalore suicide
Bodybuilder commits suicide
Love affair suicide
Girlfriend engagement
Karnataka news
Suicide note
Mahalakshmi Layout
Valentine's Day

More Telugu News