అదనపు టారిఫ్ లను తగ్గించిన ట్రంప్.. ఇకపై 18 శాతం పన్ను వసూలు
- ట్రేడ్ డీల్ నేపథ్యంలో శుక్రవారం అమెరికా అధ్యక్షుడి ప్రకటన
- రష్యా చమురు దిగుమతుల నిలిపివేతకు భారత్ కట్టుబడి ఉందని వెల్లడి
- 25 శాతం ప్రతీకార సుంకాలను తగ్గిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై ట్రంప్ అప్పట్లో ప్రతీకార సుంకాలు విధించారు. ఆయా దేశాల నుంచి అగ్రరాజ్యానికి దిగుమతి అయ్యే వస్తుసేవలపై 25 శాతం పన్నులు విధించి అమలు చేశారు. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. దీనికితోడు భారత్ పై అదనపు సుంకాలు మరో 25 శాతం విధించారు.
మొత్తంగా 50 శాతం టారిఫ్ లు విధించడంతో భారత ఎగుమతిదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇటీవల కుదరిన ట్రేడ్ డీల్ తర్వాత అదనపు సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి ట్రంప్ తగ్గించారు. దీంతో భారత్ పై ప్రతీకార సుంకాలు 25 శాతం, అదనపు సుంకాలను 18 శాతం అమెరికా అధికారులు వసూలు చేశారు. ట్రంప్ తాజా ప్రకటనతో ఇకపై భారత వస్తుసేవల మీద కేవలం 18 శాతం పన్నులు మాత్రమే వసూలు చేయనున్నారు.