లోక్ సభలో ప్రధాని మోదీపై దాడికి కాంగ్రెస్ ప్లాన్: పార్లమెంటు వర్గాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోక్ సభలో ప్రధాని మోదీపై దాడికి కాంగ్రెస్ ప్లాన్: పార్లమెంటు వర్గాలు!

Congress Plan to Attack PM Modi in Lok Sabha Reports
  • అందుకే ప్రధాని ప్రసంగం లేకుండానే తీర్మానం
  • మోదీ మాట్లాడే సమయంలో దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం వచ్చిందన్న లోక్ సభ వర్గాలు
  • అందుకే మహిళా ఎంపీలను పంపించారని వెల్లడి
గతంలో ఎన్నడూ లేని విధంగా, గురువారం ప్రధానమంత్రి ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించింది. అయితే ప్రధాని మోదీపై దాడికి ప్లాన్ జరిగినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లోక్ సభలో ప్రధాని మోదీ మాట్లాడే సమయంలో ఆయనను చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు సమాచారం రావడంతోనే సభను వాయిదా వేసినట్లు లోక్ సభ వర్గాలు వెల్లడించాయి.

దాంతో ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్ సభ గురువారం ఆమోదించింది.

ఈ తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడకపోవడం అరుదైన అంశమని, ఈ సభలో మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు ప్రధాన ప్రతిపక్షం ప్లాన్ చేసినట్లు సమాచారం వచ్చిందని లోక్ సభ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అందుకోసమే మహిళా ఎంపీలను పంపించారని పేర్కొంది. ప్రసంగించేందుకు మోదీ అందుబాటులో ఉన్నప్పటికీ ఈ సమాచారంతో బుధవారం సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని తెలిపింది.
Advertisement
Narendra Modi
Lok Sabha
Congress
Parliament
President Speech
Attack Plan
Indian Politics

More Telugu News