హన్మకొండలో మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
- కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
- టీటీడీ కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు
- లెక్కింపునకు పది రోజుల సమయం పట్టే అవకాశం
ఈ మహా జాతర హుండీలను హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. ఈరోజు మంత్రి కొండా సురేఖ కొబ్బరికాయ కొట్టి లెక్కింపును ప్రారంభించారు. మేడారం జాతరకు తరలి వచ్చిన భక్తులు అమ్మవార్లకు కానుకలు సమర్పించుకున్నారు. క్రితంసారి మేడారం జాతరకు రూ.13 కోట్ల ఆదాయం సమకూరింది.