Philippines Fire: అర్ధరాత్రి విషాదం.. ఫిలిప్పీన్స్ లో ఘోర అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!
- కాలి బూడిదైన వెయ్యికి పైగా నివాసాలు
- 5 వేల మందికి పైగా నిరాశ్రయులు
- తీరప్రాంత నగరం బొంగావోలో దారుణం
ఫిలిప్పీన్స్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తీరప్రాంత నగరం బొంగావోలో ఓ ప్రాంతం మొత్తాన్ని మంటలు తుడిచిపెట్టేశాయి. మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఎగసిపడ్డ మంటలు సముద్రంపై నిర్మించుకున్న నివాసాలను బూడిద కుప్పగా మార్చేశాయి. దాదాపు వెయ్యికి పైగా ఇళ్లు కాలి బూడిదవగా.. ఐదు వేల మందికి పైగా నిరాశ్రయులుగా మారారు. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో ఓ ఇంట్లో ఎగసిపడ్డ మంటలే ఈ భారీ అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.
పెను గాలులకు మంటలు వేగంగా వ్యాపించాయని, చుట్టుపక్కల ఇళ్లకు అంటుకున్నాయని చెప్పారు. ఎగసిపడుతున్న మంటలను చూసి ఇళ్లల్లోని జనం ఒడ్డుకు పరుగులు తీశారు. మరికొందరు సముద్రంలో దూకి ఈదుతూ తీరం చేరారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అయితే, అప్పటికే ఆ ఏరియా మొత్తం కాలిబూడిదైంది. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి బాధితులను షెల్టర్ హోంకు తరలించారు.
బాధితులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని అధికార యంత్రాంగం తెలిపింది. తాత్కాలిక టెంట్లు, ఆహార పదార్థాలు, నీరు ఏర్పాటు చేసి, గాయపడ్డవారికి చికిత్స అందించినట్లు వెల్లడించింది. కాగా, ఈ భారీ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.