Dharmapuri Arvind: రాత్రి 11 గంటల సమయంలో మాకు ఈ కర్ణభేరి పరీక్ష ఏమిటి?: ధర్మపురి అర్వింద్

Dharmapuri Arvind Questions Late Night Mosque Loudspeaker Use
షార్ట్స్‌లో చూడండి
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నివాసానికి దగ్గరగా ఉన్న మసీదు వద్ద ఏర్పాటు చేసిన స్పీకర్ నుంచి పెద్ద ఎత్తున శబ్దం వస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ శబ్దం వినిపిస్తున్న వీడియో తీసి ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ఈ కర్ణభేరి పరీక్ష ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

మరో 15 రోజుల్లో పదో తరగతి పరీక్షలు ఉన్నాయని... ఆ తర్వాత ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని అర్వింద్ తెలిపారు. ఇలాంటి తరుణంలో రాత్రి 11 గంటలకు ఇదేమిటని ప్రశ్నించారు. "భాయ్... మీకు జాగారం కావాలంటే చేసుకోండి. మమ్మల్ని పడుకోనివ్వండి" అని అన్నారు. 

మరోవైపు, అర్వింద్ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ఆయన ఈ ట్వీట్ చేశారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ ప్రార్థనా మందిరం అయినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, స్పీకర్లను తొలగించాలని మరికొందరు సూచిస్తున్నారు.

Go Back to Shorts
Dharmapuri Arvind
BJP
Nizamabad
Mosque
Loudspeaker
Noise Pollution
Municipal Elections
SSC Exams
Inter Exams

More Telugu News