Jogi Ramesh: ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్.. జోగి రమేశ్ ఇంటికి నిప్పు

Jogi Rameshs House Set Ablaze in Ibrahimpatnam Amidst Tensions
షార్ట్స్‌లో చూడండి
విజయవాడ సమీపంలోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ నివాసాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముట్టడించాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది.

టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. తొలుత ఇంటిపై రాళ్లతో దాడి చేసి, ఆ తర్వాత ఇంటికి నిప్పుపెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను కూడా దగ్ధం చేశారు. దాడి సమయంలో జోగి రమేశ్ ఇంట్లో లేరు. ఈ ఘటనలో ఇంటి మొదట అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని శాంతింపజేసేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, అయితే ఇంటికి మాత్రం తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Go Back to Shorts
Jogi Ramesh
Ibrahimpatnam
TDP
YSRCP
Chandrababu Naidu
Nara Lokesh
Andhra Pradesh Politics
House Attack
Fire
Political Violence

More Telugu News