Uttar Pradesh Government: స్కూళ్లలో వార్తాపఠనం... పాఠశాలలకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం

Uttar Pradesh Government Makes Newspaper Reading Mandatory in Schools
  • విద్యార్థులను స్క్రీన్‌లకు దూరంగా, పుస్తకాల వైపు మళ్లించే లక్ష్యంతో జీవో జారీ
  • వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేసిన యూపీ ప్రభుత్వం
  • అన్ని పాఠశాలల్లో వార్తా పత్రికలు అందుబాటులో ఉంచాలని ఆదేశం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తరగతి గదులను డిజిటల్ స్క్రీన్‌ల నుంచి పుస్తకాల వైపు మళ్ళించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని సెకండరీ, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు వార్తా పత్రికలు చదవడాన్ని తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.

విద్యార్థుల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొదించడానికి, డిజిటల్ స్క్రీన్ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా పాఠశాల గ్రంథాలయాల్లో హిందీ, ఇంగ్లీష్ వార్తా పత్రికలను అందుబాటులో ఉంచనున్నారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థులకు చదివే అలవాటును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ప్రాథమిక మరియు మాధ్యమిక విద్యా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డిసెంబర్ 23న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు వార్తా పత్రికలను విద్యార్థుల దినచర్యలో భాగంగా చేయాలి. వీటిని ఐచ్ఛికంగా కాకుండా సాధారణ అభ్యాస సాధనంగా పరిగణించాలని ఆదేశించింది. హిందీ, ఇంగ్లీష్ వార్తా పత్రికలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
Uttar Pradesh Government
UP schools
Uttar Pradesh education
reading newspapers
student reading habits

More Telugu News