Champion movie: ఈ వారం విడుదలైన సినిమాల రేటింగ్స్ ఇవే!

latest Movies Update
షార్ట్స్‌లో చూడండి
ఈ ఏడాదిలో పెద్ద సినిమాల జోరు తక్కువేనని చెప్పాలి. థియేటర్ల దగ్గర చిన్న సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. ఏడాది చివరికి చేరుకుంటూ ఉండగా, ఈ వారంలో కూడా థియేటర్ల దగ్గర చిన్న సినిమాల హడావిడినే కనిపించింది. ఆ సినిమాల జాబితాలో ఛాంపియన్ .. శంబాల .. దండోరా .. ఈషా వంటి సినిమాలు ఉన్నాయి. ఈ మూడింటిలో కాస్త ఎక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమాగా 'ఛాంపియన్' కనిపిస్తుంది. రోషన్ - అనశ్వర రాజన్ జంటగా నటించిన సినిమా ఇది. 

స్వప్న సినిమా బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించాడు. రోషన్ - అనశ్వర జోడీగా కొత్తగా అనిపించడం .. రెండు పాటలు జనంలోకి వెళ్లడం వలన ఈ సినిమాపై బజ్ ఏర్పడింది. రజాకార్ల కాలంలో నడిచే ఈ కథకి, చాలా సైట్లు 2.5 నుంచి 3 వరకూ రేటింగ్ ఇచ్చాయి. ఆ తరువాత స్థానంలో నిలిచిన సినిమాగా 'శంబాల' కనిపిస్తుంది. ఆది సాయికుమార్ .. అర్చన అయ్యర్ .. శ్వాసిక విజయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి చాలా సైట్లు 2.5 రేటింగును ఇచ్చాయి. 

ఇక పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా 'ఈషా' కూడా థియేటర్ల దగ్గర సందడి చేసింది. హారర్ థ్రిల్లర్ కంటెంట్ పట్ల ఆసక్తిని చూపించిన ప్రేక్షకుల సంఖ్య ఎక్కవగానే కనిపించింది. హెబ్బా పటేల్ - అఖిల్ రాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కూడా ఎక్కువ సైట్ల నుంచి 2.5 రేటింగ్ నే తెచ్చుకుంది. శివాజీ - నవదీప్ నటించిన 'దండోరా' కూడా ఎక్కువగా 2.5 .. 2.75 రేటింగ్ నే నమోదు చేసింది. విలేజ్ నేపథ్యంతో కూడిన ఈ సినిమా, ఎమోషన్స్ వైపు నుంచి ఎక్కువగా కనెక్ట్ అయింది.   

Go Back to Shorts
Champion movie
Roshan
Anaswara Rajan
Shambala movie
Adi Saikumar
Eesha movie
Hebah Patel
Dandora movie
Shivaji
Navdeep
Telugu movie ratings

More Telugu News