Sonia Gandhi: సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- నేషనల్ హెరాల్డ్ కేసులో హైకోర్టు నోటీసులు
- ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ట్రయల్ కోర్టు నిరాకరణ
- ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ట్రయల్ కోర్టు నిరాకరించింది. ఈ తీర్పును ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో రాహుల్, సోనియా గాంధీతో పాటు ఈ కేసులోని ఇతరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజేఎల్‌కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈ వ్యవహారంలో సోనియా, రాహుల్, ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, సుమన్ దూబే తదితరులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది.
ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ఈ సంస్థ కేవలం రూ.50 లక్షలు చెల్లించి ఏజేఎల్‌కు చెందిన సుమారు రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తులు పొందారని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.