Radhika Apte: వాళ్ల పేర్లు చెబితే షాకవుతారు: ఇండస్ట్రీపై రాధికా ఆప్టే వ్యాఖ్యలు

Radhika Apte Reveals Shocking Experiences in South Films
  • డబ్బు కోసమే సౌత్ సినిమాలు చేశానన్న రాధికా ఆప్టే
  • సౌత్ సెట్స్‌లో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నానని వెల్లడి
  • బాలీవుడ్‌లో కొందరి నిజస్వరూపాలు చూసి షాకయ్యానన్న రాధిక
ఎటువంటి అంశంపైనైనా ముక్కుసూటిగా మాట్లాడే నటి రాధికా ఆప్టే, సినీ పరిశ్రమలో తన 20 ఏళ్ల ప్రయాణంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దక్షిణాది చిత్రాల్లో కేవలం డబ్బు కోసమే నటించాల్సి వచ్చిందని, ఆ సమయంలో కొన్ని భయంకరమైన అనుభవాలను ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే మాట్లాడుతూ.. "ఒకప్పుడు ఆర్థిక పరిస్థితుల వల్ల సౌత్ సినిమాలు చేయాల్సి వచ్చింది. ఆ సెట్స్‌లో కొన్నిసార్లు భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. మొత్తం సెట్‌లో నేనొక్కదాన్నే మహిళను ఉండేదాన్ని. మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరిగేది. నా సిబ్బందిని కూడా అనుమతించేవారు కాదు. మహిళల గురించి అసభ్యకరమైన జోకులు వేస్తూ నన్ను చాలా అసౌకర్యానికి గురిచేశారు" అని తెలిపారు. 

"సాధారణంగా నేను ధైర్యంగా ఉంటాను. కానీ ఆ రోజుల గురించి ఆలోచిస్తే ఇప్పటికీ నా గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది. ఏ నటికీ అలాంటి పరిస్థితి రాకూడదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాలీవుడ్‌లోనూ తనకు కొన్ని చేదు అనుభవాలు ఎదురైనట్లు ఆమె చెప్పారు. "కొన్ని ఆఫర్ల కోసం కొందరిని కలిశాను. వాళ్లతో మాట్లాడాక మళ్లీ జీవితంలో కలవకూడదని నిర్ణయించుకున్నాను. వాళ్లు ఇండస్ట్రీలో చాలా పేరున్న వ్యక్తులు. వాళ్ల పేర్లు చెబితే అందరూ ఆశ్చర్యపోతారు" అని రాధిక పేర్కొన్నారు.

2005లో హిందీ సినిమాతో నటిగా అరంగేట్రం చేసిన రాధికా ఆప్టే.. ఆ తర్వాత తమిళం, మరాఠీ, మలయాళ చిత్రాల్లోనూ నటించారు. 2010లో ‘రక్త చరిత్ర’ సినిమాతో ఆమె టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 
Radhika Apte
Radhika Apte interview
South Indian movies
Bollywood
MeToo movement
Tollywood
sexual harassment
film industry
actress
casting couch

More Telugu News