Rajendranagar: రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్ ప్రెస్ వేపై ట్రాఫిక్‌ జామ్‌.. వీడియో ఇదిగో!

Rajendranagar Traffic Jam on PV Expressway After Accident
--
హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో మూడు కార్లు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. పీవీ ఎక్స్ ప్రెస్ వే పై జరిగిన ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. పిల్లర్‌ నెంబర్‌ 253 వద్ద జరిగిన ఈ ప్రమాదం కారణంగా పీవీ ఎక్స్ ప్రెస్ వేపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఉప్పర్‌పల్లి నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి.

ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
Rajendranagar
Rajendranagar traffic jam
PV Expressway
Hyderabad traffic
Road accident Hyderabad
Traffic updates
Accident news
Upperpally
Aramgarh
Hyderabad

More Telugu News