ఎల్లారెడ్డిలో సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్‌తో ఢీకొట్టిన ఘటన.. తీవ్రంగా స్పందించిన కేటీఆర్
- ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట గ్రామంలో ఘటన
- బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని ట్రాక్టర్‌తో ఢీకొట్టినట్టు ఆరోపణలు
- ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన కేటీఆర్
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, సోమార్‌పేట గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి బాలరాజుని కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ పాపయ్య ట్రాక్టరుతో ఢీకొట్టాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్ పాపయ్య అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ, ఎల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫోన్ చేసి, ఈ ఘటనలో గాయపడిన నాయకులు, కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు.