జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు
- గ్రేటర్ హైదరాబాద్‌లో రెట్టింపైన వార్డుల సంఖ్య
- 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు
- 27 మున్సిపాలిటీల విలీనమే ఇందుకు ప్రధాన కారణం
ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ సమీపంలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ నేపథ్యంలో పెరిగిన జనాభా, విస్తీర్ణానికి అనుగుణంగా వార్డుల పునర్విభజన అనివార్యమైంది. ఇందులో భాగంగానే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ రాజకీయ స్వరూపం పూర్తిగా మారనుంది. వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారులు త్వరలోనే ప్రారంభించనున్నారు. కొత్తగా విలీనమైన ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, అభివృద్ధి పనులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ పెంపు దోహదపడుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికలు 300 వార్డుల ప్రాతిపదికనే జరగనున్నాయి.