Rohit Sharma: 20,000 పరుగుల క్లబ్ లో చేరిన రోహిత్ శర్మ.. నాలుగో భారత క్రికెటర్

Rohit Sharma Reaches 20000 Runs Milestone Fourth Indian Cricketer
  • సచిన్, ద్రావిడ్, కోహ్లీ తర్వాత ఫీట్ సాధించిన నాలుగో ఆటగాడు
  • 14వ ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీసి మైలురాయి చేరుకున్న రోహిత్ శర్మ
  • వన్డేల్లో 11,468, టెస్టుల్లో 4,301, టీ20ల్లో 4,231 పరుగులు చేసిన హిట్ మ్యాన్
విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో రోహిత్ శర్మ ఒక మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగవ భారతీయ ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించాడు. 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ మంచి శుభారంభాన్నిచ్చారు.

రోహిత్ శర్మ 20,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి ఈ రోజు మ్యాచ్‌లో మరో 27 పరుగులు చేయాల్సి ఉండగా, మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వేగంగా పరుగులు సాధించి సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగవ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

కేశవ్ మహరాజ్ వేసిన 14వ ఓవర్లో నాలుగవ బంతికి రోహిత్ శర్మ సింగిల్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో 11,468, టెస్టుల్లో 4,301, టీ20ల్లో 4,231 పరుగులు అతడి ఖాతాలో ఉన్నాయి. ప్రపంచ క్రికెటర్లలో ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడుగా రోహిత్ శర్మ నిలిచాడు.
Rohit Sharma
India vs South Africa
20000 runs
Sachin Tendulkar
Rahul Dravid
Virat Kohli

More Telugu News