Naresh: ఇండిగోపై సినీ నటుడు నరేశ్ ఫైర్

Actor Naresh Expresses Frustration with Indigo Airlines
  • ఇండిగో సాంకేతిక సమస్యల్లో చిక్కుకున్న నటుడు నరేశ్
  • హైదరాబాద్ విమానాశ్రయంలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్న వైనం
  • 90ల నాటి విమాన ప్రయాణాలే సురక్షితమంటూ పోస్ట్
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ గందరగోళంలో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ కూడా చిక్కుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

బుధవారం ఉదయం 8:15 గంటలకు తాను హైదరాబాద్‌లోని ఇండిగో టెర్మినల్‌కు చేరుకున్నానని, కానీ అప్పటికే అన్ని విమానాలు ఆలస్యమయ్యాయని నరేశ్ తెలిపారు. మూసి ఉన్న బోర్డింగ్ గేట్ల వద్ద గందరగోళంలో ఉన్న ప్రయాణికుల వీడియోను ఆయన పోస్ట్ చేశారు. "విమాన ప్రయాణాల్లోని సరదా 90వ దశకంతోనే ముగిసిపోయింది. గ్రౌండ్ సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. అంతా గజిబిజిగా ఉంది" అని తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రస్తుత విమాన ప్రయాణాల కన్నా 1990ల నాటి ప్రయాణాలే సురక్షితంగా, మెరుగ్గా ఉండేవని నరేశ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, నటులకు ప్రైవసీ కూడా లేకుండా పోయిందని ఆయన వాపోయారు. "మాస్కులు, సన్‌గ్లాసెస్ పెట్టుకున్నా కూడా స్కానర్లు నటులను గుర్తించేస్తున్నాయి. టైమ్ మెషీన్ ఉంటే బాగుండును, 90ల నాటి రోజులకు వెళ్లిపోయేవాడిని" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Naresh
Naresh actor
Indigo airlines
Hyderabad airport
Flight delays
Tollywood actor
Air travel
Travel experience
Airline issues

More Telugu News