Akshay Kumar: అక్షయ్ కుమార్ - శిల్పా శెట్టిల పెళ్లి ఎందుకు ఆగిపోయింది? .. అసలు విషయం చెప్పిన దర్శకుడు

Sunil Darshan Reveals Why Akshay Kumar Shilpa Shetty Did Not Marry
  • ఒకప్పుడు ప్రేమలో మునిగితేలిన అక్షయ్ - శిల్ప
  • శిల్ప తల్లిదండ్రుల షరతుల వల్లే పెళ్లి ఆగిపోయిందని చెప్పిన సునీల్ దర్శన్
  • తమ కుమార్తె భద్రత కోసమే ఆ కండిషన్లు పెట్టారని వెల్లడి
ఒకప్పుడు బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్, శిల్పా శెట్టిల ప్రేమాయణం పెద్ద చర్చనీయాంశం. 1990లలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో వారి బంధం ముగిసిపోయింది. దీనికి సంబంధించి ప్రముఖ ఫిల్మ్‌మేకర్ సునీల్ దర్శన్ తాజాగా ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

‘బాలీవుడ్ తికానా’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అక్షయ్, శిల్పాలు పెళ్లి చేసుకునే దశకు చేరుకున్నారని... కానీ, శిల్పా తల్లిదండ్రులు పెట్టిన కొన్ని షరతుల వల్ల ఆ వివాహం ఆగిపోయిందని తెలిపారు. "తమ కుమార్తె భద్రత కోసం తల్లిదండ్రులు కొన్ని హామీలు కోరారు. తల్లిదండ్రులుగా వారు అలా కోరడంలో తప్పు లేదు. అన్ని రకాల భద్రతను కోరుకున్నారు. కానీ, ఆ సమయంలో వారు చేసింది తప్పని నాకు అనిపించింది. బహుశా వారి పెళ్లి జరగాలని రాసిపెట్టి లేదేమో" అని సునీల్ దర్శన్ వివరించారు.

అంతేకాదు, రాజేశ్ ఖన్నాకు సంబంధించిన ఒక జోతిష్యుడు.. అక్షయ్, ట్వింకిల్ ఖన్నా పెళ్లి చేసుకుంటారని ఎప్పుడో చెప్పారని, ఆ సమయంలో వారి మధ్య ఎలాంటి సంబంధం లేకపోవడంతో తాను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని గుర్తుచేసుకున్నారు.

‘ఏక్ రిష్తా’ సినిమా షూటింగ్‌కు కొన్ని రోజుల ముందు అక్షయ్, శిల్పా విడిపోయారని సునీల్ తెలిపారు. అయితే ఈ బ్రేకప్ వల్ల అక్షయ్ కుమార్‌ కుంగిపోలేదని, ఆ సమయంలో 'ధడ్కన్', 'హేరా ఫేరి' వంటి సినిమాలతో బిజీగా ఉంటూ కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టాడని చెప్పారు. ఆ తర్వాత అక్షయ్ కుమార్ 2001లో ట్వింకిల్ ఖన్నాను, శిల్పా శెట్టి 2009లో రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 
Akshay Kumar
Shilpa Shetty
Akshay Kumar Shilpa Shetty
Bollywood breakup
Sunil Darshan
Twinkle Khanna
Raj Kundra
Bollywood news
marriage
love affair

More Telugu News