Vladimir Putin: భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్... స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ

Vladimir Putin Arrives in India Welcomed by PM Modi
  • ఢిల్లీ సమీపంలోని పాలం ఎయిర్ స్టేషన్‌లో దిగిన పుతిన్
  • పుతిన్, మోదీ ఆత్మీయ ఆలింగనం
  • 23వ వార్షిక శిఖరాగ్ర భేటీ భాగంగా సమావేశం కానున్న మోదీ, పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం నేడు సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన పాలం ఎయిర్ స్టేషన్‌లో దిగగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. పుతిన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మన దేశానికి రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు దేశాధినేతలు సమావేశం కానున్నారు.

విమానాశ్రయంలో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పుతిన్‌ గౌరవార్థం రాత్రి ప్రధానమంత్రి విందు ఇవ్వనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం పలకనున్నారు. అలాగే, 23వ భారత్‌-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అణువిద్యుత్‌‌తో సహా పలు రంగాల్లో రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి.
Vladimir Putin
Putin India visit
Narendra Modi
India Russia summit
Russia Ukraine war

More Telugu News