హైదరాబాద్‌లో బాలుడిపై వీధి కుక్కల దాడి.. నివేదిక కోరిన మానవ హక్కుల కమిషన్
- హయత్ నగర్ శివగంగా కాలనీలో ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
- దినపత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న కమిషన్
- నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
ఈ ఘటనకు సంబంధించి పలు దినపత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 29వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, బాలుడి ప్రస్తుత పరిస్థితి, కుక్కల స్టెరిలైజేషన్, నియంత్రణ చర్యల స్థితిగతులను నివేదికలో పేర్కొనాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలు తీరుపై సమగ్ర నివేదిక అందజేయాలని కోరింది.