'థామా' .. ఇక తెలుగులోనూ చూడొచ్చు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'థామా' .. ఇక తెలుగులోనూ చూడొచ్చు!

Thamma Movie Update
  • రష్మిక ప్రధాన పాత్రగా రూపొందిన 'థామా'
  • 200 కోట్లకు పైగా రాబట్టిన సినిమా 
  • ఈ నెల 2 నుంచి రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ 
  • 16 నుంచి సబ్ స్క్రయిబర్స్ అందరికీ అందుబాటులో 
  • తెలుగు ఆడియోతో చూసే ఛాన్స్ 
 
బాలీవుడ్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో అందరూ ఎక్కువగా మాట్లాడుకున్న సినిమా 'థామా'. రష్మిక - ఆయుష్మాన్ ఖురానా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ఆదిత్య సర్పోదర్ దర్శకత్వం వహించాడు. దినేశ్ విజన్ - అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమా, అక్టోబర్ 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. 140 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, 210 కోట్లను వసూలు చేసింది.

 'థామా' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కంటెంట్ కి విశేషమైన ఆదరణ లభించింది. దాంతో అందరూ కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ నెల 2వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. దాంతో కొంతమందికి మాత్రమే ఇది సంతోషించదగిన విషయంగా నిలిచింది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు అందరి ముచ్చటను తీర్చనుంది. తాజాగా ఫ్రీ ఓటీటీ రిలీజ్ డేట్ ను 'అమెజాన్ ప్రైమ్' వారు ప్రకటించారు. ఈ నెల 16వ తేదీ నుంచి సబ్ స్క్రయిబర్స్ అందరికీ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. వాళ్లంతా ఎలాంటి రెంట్ చెల్లించకుండానే ఈ సినిమాను వీక్షించవచ్చు. అడవిలో రక్త పిశాచిగా ఉన్న నాయిక, కొన్ని కారణాల వలన జనంలోకి రావలసి వస్తుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేది కథ. 

Advertisement
Thama
Thama Movie
Rashmika Mandanna
Ayushmann Khurrana
Amazon Prime
Bollywood Movie
Telugu Dubbed
Aditya Sarpotdar
Dinesh Vijan
Amar Kaushik

More Telugu News