Ranveer Singh: మనోభావాలను దెబ్బతీస్తే క్షమించండి: వెనక్కి తగ్గిన రణ్‌వీర్

Kantara Controversy Ranveer Singh Issues Apology
  • 'కాంతార' దైవం సీన్‌ను అనుకరించి వివాదంలో చిక్కుకున్న రణ్‌వీర్ సింగ్
  • సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు
  • రిషబ్ నటనను ప్రశంసించాలన్నదే తన ఉద్దేశమని వెల్లడి
'కాంతార' సినిమాలోని దైవ నృత్యం సన్నివేశాన్ని అనుకరించి తీవ్ర విమర్శల పాలైన బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ వెనక్కి తగ్గారు. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహంతో ఆయన క్షమాపణలు తెలిపారు. ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే తనను క్షమించాలంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.

గోవాలో నవంబర్ 30న జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన కొత్త చిత్రం 'దురంధర్' ప్రమోషన్స్‌లో భాగంగా వేదికపై మాట్లాడిన రణ్‌వీర్, 'కాంతార'లో రిషబ్ శెట్టి నటనను ప్రశంసించారు. ఆ తర్వాత దైవం ఆవహించిన సన్నివేశాన్ని అనుకరించారు. అయితే, బూట్లు ధరించి ఆ పవిత్రమైన నృత్యాన్ని అనుకరించడం, దైవాన్ని 'ఆడ దెయ్యం' (female ghost) అని సంబోధించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

దీంతో రణ్‌వీర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వివరణ ఇచ్చారు. "ఆ సినిమాలో రిషబ్ అద్భుతమైన నటనను ప్రశంసించాలన్నదే నా ఉద్దేశం. ఒక నటుడిగా ఆ సన్నివేశంలో నటించడానికి ఎంత కష్టపడతారో నాకు తెలుసు. మన దేశంలోని ప్రతి సంస్కృతి, సంప్రదాయం, నమ్మకాన్ని నేను గౌరవిస్తాను. నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నాను" అని పేర్కొన్నారు.
Ranveer Singh
Kantara
Rishab Shetty
IFFI Goa
Bollywood
Divine Dance
Apology
Durandhar
Film Festival of India
Cultural Sensitivity

More Telugu News