‘మోగ్లీ 2025’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకున్న సుమ తనయుడు రోషన్
- యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల కొత్త చిత్రం ‘మోగ్లీ 2025’
- డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నట్టు ప్రకటన
- జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం
- ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం
జాతీయ అవార్డు గ్రహీత, ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో రోషన్ కనకాల సరసన సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ యువ సంగీత సంచలనం కాలా భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వినూత్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాతో రోషన్ మంచి విజయాన్ని అందుకుంటాడని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.