Rahul Sipligunj: కాబోయే భార్యకు రాహుల్ అదిరిపోయే గిఫ్ట్.. సంగీత్‌కు స్టార్ క్రికెటర్!
- సంగీత్ వేడుకకు భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌కు ఆహ్వానం
- ఫేవరెట్ క్రికెటర్‌ను చూసి ఆనందంలో మునిగిపోయిన హరిణ్య రెడ్డి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాహుల్, హరిణ్య, చాహల్ ఫొటోలు
- ఈ నెల 27న ఘనంగా జరగనున్న వివాహ వేడుక
స్టార్ సింగర్, ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తన పెళ్లి వేడుకల్లో భాగంగా కాబోయే భార్య హరిణ్య రెడ్డికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆమె వీరాభిమాని అయిన టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను నేరుగా తమ సంగీత్ వేడుకకే ఆహ్వానించి ఆశ్చర్యపరిచారు. తన ఫేవరెట్ క్రికెటర్‌ను చూసిన హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అపురూప క్షణాలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ నెల 27న రాహుల్, హరిణ్యల వివాహం జరగనున్న నేపథ్యంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జరిగిన సంగీత్ వేడుకకు చాహల్‌ను పిలిచి రాహుల్ ప్రత్యేక కానుక ఇచ్చారు. ఈ సంతోషాన్ని హరిణ్య తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నా జీవితంలో ఇంత పెద్ద గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్యూ రాహుల్! మా సంగీత్‌కు వచ్చి వేడుకను ప్రత్యేకం చేసిన చాహల్ గారికి ధన్యవాదాలు" అంటూ చాహల్‌తో దిగిన ఫొటోలను ఆమె షేర్ చేశారు.
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు రాహుల్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఎల్లుండి ఉదయం 5 గంటలకు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఓ లగ్జరీ ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా రాహుల్, హరిణ్య స్వయంగా కలిసి వివాహానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే. హరిణ్య రెడ్డి, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె. నిశ్చితార్థంలోనూ రాహుల్ ఆమెకు ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచారు.