Telangana Congress: తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులు

Telangana Congress Announces New DCC Presidents for All Districts
  • జాబితాను అధికారికంగా ప్రకటించిన కేసీ వేణుగోపాల్
  • సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు కొత్త అధ్యక్షుల ఎంపిక
  • హైదరాబాద్‌కు ముగ్గురు డీసీసీ అధ్యక్షుల నియామకం
తెలంగాణ కాంగ్రెస్‌లో సంస్థాగత నియామకాల ప్రక్రియను అధిష్ఠానం పూర్తి చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. మొత్తం 33 జిల్లాలతో పాటు, 3 నగర కార్పొరేషన్లకు కూడా కొత్త అధ్యక్షులను నియమించారు. పార్టీ పరంగా హైదరాబాద్ నగరాన్ని మూడు జిల్లాలుగా పరిగణించి, ముగ్గురు డీసీసీ అధ్యక్షులను నియమించడం జరిగింది. 
 
కొత్తగా నియమితులైన వారిలో అదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడుగా డాక్టర్ నరేశ్ జాదవ్, ఆసిఫాబాద్‌కు ఆత్రం సుగుణ, భద్రాద్రి కొత్తగూడెంకు తోట దేవీ ప్రసన్న, భువనగిరికి బీర్ల ఇల్లయ్య, గద్వాల్‌కు ఎమ్.రాజీవ్ రెడ్డి, హన్మకొండకు ఎంగల వెంకట రామ్ రెడ్డి,  హైదరాబాద్‌కు సయ్యద్ ఖలీద్ సైఫుల్లా, జగిత్యాలకు గజేంగి నందయ్య, జనగాంకు లఖావత్ దన్వంతి, జయశంకర్ భూపాలపల్లెకు భట్టు కరుణాకర్, కామారెడ్డికి మల్లిఖార్జున్ ఆలె, కరీంనగర్‌కు  మాదేపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్‌కు వి.అంజన్ కుమార్, ఖైరతాబాద్‌కు మొత రోహిత్ ముదిరాజ్, ఖమ్మంకు నూతి సత్యనారాయణ, ఖమ్మం కార్పొరేషన్‌కు దీపక్ చౌదరి, మహబూబాబాద్‌కు భూక్యా ఉమ, మహబూబ్‌నగర్‌కు ఎ. సంజీవ్ ముదిరాజ్, మంచిర్యాల్‌కు పిన్నింటి రఘునాద్ రెడ్డి, మెదక్‌కు శివనగరి ఆంజనేయులు గౌడ్, మేడ్చల్ మల్కాజ్ గిరికి తోటకూర వజ్రేష్ యాదవ్, ములుగుకు పైడాకుల అశోక్, నాగర్ కర్నూల్‌కు చిక్కుడు వంశీ కృష్ణ,  నల్గొండకు పున్న కైలాశ్ నేత, నారాయణ్‌పేట్‌కు కొల్లుకుదురు ప్రశాంత్ కుమార్ రెడ్డి, నిర్మల్‌కు వేద్మ బొజ్జు, నిజామాబాద్‌కు కాట్పల్లి నాగేశ్‌‌రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్‌కు బొబ్బిలి రామక, పెద్దపల్లి జిల్లాకు ఎమ్.ఎస్.రాజ్ ఠాకూర్, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. 
Telangana Congress
TPCC
Revanth Reddy
DCC Presidents
Telangana DCC
AICC
K C Venugopal
Congress Party
District Congress Committee
Telangana Politics

More Telugu News